ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ)- ఎన్టీఆర్ పథకం అమలు చేస్తున్నాయి. ఇందుకు అర్హులను గుర్తించేందుకు ‘ఆవాస్+’ అనే యాప్‌ను తీసుకొచ్చి ఎంపిక చేపడుతున్నాయి. నవంబర్ 30తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఇప్పటికే ఏపీలో 3.47 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.2.89 లక్షలు చెల్లిస్తారు.
short by
srikrishna /
08:39 am on
24 Nov