ఏపీలోని 150కి పైగా మండలాల్లో శనివారం ఉష్ణోగ్రతలు 40°C పైచిలుకు నమోదయ్యాయని IMD తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సగటున 40°C చేరాయని పేర్కొంది. ప్రస్తుతం సాధారణం కంటే 4°C వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు వెల్లడించింది. కాగా ప్రకాశం జిల్లా కొమరోలు, నంద్యాల, కమలాపురంలో అత్యధికంగా 42.5°C మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఎస్‌కోట, అనకాపల్లి, రుద్రవరంలో 42°C ఉష్ణోగ్రత నమోదైంది.
short by
Devender Dapa /
02:39 pm on
29 Mar