ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని గురుకుల బాలికల పాఠశాలలో కావ్య అనే 15 ఏళ్ల టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం తోటి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనానికి వెళ్లిన బాలిక, ఆపై కంచం తీసుకొస్తానని గదిలోకి వెళ్లింది. ఎంతకీరాకపోవడంతో వెళ్లి చూడగా, చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. తల్లి ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో తాను చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నానని కావ్య తరచూ స్నేహితులతో చెప్పేది.
short by
Devender Dapa /
09:43 am on
22 Nov