మూవీ పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసు వివరాలివ్వాలని హైదరాబాద్ సీపీకి ఈడీ లేఖ రాసింది. ఐ-బొమ్మ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. క్రిప్టోవాలెట్ నుంచి నిందితుడు ఇమ్మడి రవి ఎన్నారై ఖాతాకు నెలకు రూ.15 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడి బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు.
short by
Devender Dapa /
05:33 pm on
18 Nov