ఇటీవల అరెస్టయిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలని సినీ నిర్మాత సి.కల్యాణ్ వ్యాఖ్యానించారు. బాధతో ఇలా మాట్లాతున్నానని చెప్పారు. ‘’వందలాది మంది కష్టాన్ని దోచుకుంటున్న ఇలాంటి వాళ్ల రక్తాన్ని కళ్ల చూడడం చాలా అవసరం. వచ్చే రోజులలో ఒక్కరినైనా ఎన్‌కౌంటర్ చేస్తే, ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారు,’’ అని ఆయన అన్నారు. రవిని పట్టుకున్న పోలీసులను త్వరలో సత్కరిస్తామని తెలిపారు.
short by
srikrishna /
11:38 am on
19 Nov