ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసినందుకు హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ సజ్జనార్‌కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అభినందనలు తెలిపారు. ‘’పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్‌సైట్ల నిర్వాహకుడిని అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించడం స్వాగతించదగ్గ పరిణామం,’’ అని పేర్కొన్నారు. సజ్జనార్ నేతృత్వంలో చేపట్టే చర్యలు తెలుగు సినిమాకే కాదు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయన్నారు.
short by
srikrishna /
03:43 pm on
17 Nov