ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన చిన్న బొమ్మను మింగి ఊపిరాడక 4 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సదరు బాలుడికి అతడి తండ్రి చిప్స్ ప్యాకెట్ కొనిచ్చాడు. అయితే అందులో దొరికిన బొమ్మ తుపాకీతో కాసేపు ఆడుకున్న బాలుడు, ఒక్కసారిగా మింగేశాడు. బాలుడు ఏడుస్తుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు, బొమ్మను బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు మృతి చెందాడు.
short by
Devender Dapa /
10:27 pm on
19 Nov