ఏపీ నిర్మించ తలపెట్టిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమనే కేంద్ర నిపుణుల కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇది బీఆర్‌ఎస్, తెలంగాణ ప్రజల పోరాట విజయమన్నారు. తెలంగాణ జలాలపై ఏపీ చేస్తున్న కుట్రలకు ఇదో చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని హరీశ్ రావు అన్నారు.
short by
Devender Dapa /
10:38 pm on
30 Jun