తమ భూభాగాన్ని గుర్తించి, వాటి స్థానాన్ని సహచర కుక్కలకు తెలియజేసేందుకు కుక్కలు స్తంభాలు, వాహన టైర్లపై మూత్రం పోస్తాయని నిపుణులు చెబుతున్నారు. టైర్ లేదా పోల్ దిగువ భాగం కుక్క ముక్కును చేరుకునే విధంగా ఉంటుందని, దీంతో అవి ఇతర శునకాల ముక్కు స్థాయిలో తమ గుర్తును (మూత్రం) వదిలేసి, వాటికి సమాచారాన్ని పాస్ చేస్తాయని చెప్పారు. అదే నేలపై మూత్రం పోస్తే వాసన త్వరగా పోయి గుర్తించడం కష్టమవుతుందని వివరించారు.
short by
Devender Dapa /
05:12 pm on
30 Jul