స్వయం సహాయక సంఘాల కోసం హైదరాబాద్‌లోని శిల్పారామంలో 3.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ‘ఇందిరా మహిళా శక్తి బజార్’ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఇందుకోసం త్వరలోనే ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
short by
Devender Dapa /
11:12 pm on
05 Dec