For the best experience use Mini app app on your smartphone
ప్రేమ విఫలమైందని మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో 21 ఏళ్ల ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగిని సక్కుబాయి ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డిలో కానిస్టేబుల్‌గా చేస్తున్న సుధాకర్‌తో ఆమె 2 ఏళ్ల క్రితం నుంచి ప్రేమలో ఉంది. సక్కుబాయి పెళ్లి చేసుకుందామని అడగడంతో అతడు 2 నెలల నుంచి మాట్లాడటం మానేసి ఫోన్‌ నంబర్ బ్లాక్‌లో పెట్టాడని సమాచారం. దీంతో ఆమె సోమవారం తన ఇంట్లో గడ్డి మందు తాగగా, చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది.
short by srikrishna / 02:05 pm on 04 Sep
For the best experience use inshorts app on your smartphone