కోనసీమ జిల్లా రాయవరంలోని బాణసంచా పరిశ్రమలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. పరిశ్రమలో పేలుడు వల్ల ఆరుగురు సజీవ దహనం కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఒకరు, గురువారం మరొకరు చనిపోయారు. పరిశ్రమలో చిచ్చుబుడ్లలో మందు కూరుతుండగా నిప్పురవ్వలు ఎగసిపడి పేలుళ్లు సంభవించాయని ప్రాథమికంగా నిర్ధారించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందన్న అనుమానాలూ ఉన్నాయి.
short by
srikrishna /
11:06 am on
09 Oct