కామారెడ్డి శివారులో రైలు ఢీ కొని దాదాపు 90కి పైగా గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు వాటిని ఢీ కొట్టింది. గొర్రెల కాపరి దేవునిపల్లికి చెందిన దర్శపు సుధాకర్.. రైలు వస్తున్న విషయాన్ని గమనించి భయంతో పక్కనే ఉన్న వాగులోకి దూకేశాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యాడు. సుధాకర్ కోసం గాలింపు చేపట్టగా, సమీపంలో అతడి మృతదేహం లభ్యమైంది.
short by
Devender Dapa /
10:56 pm on
23 Nov