For the best experience use Mini app app on your smartphone
దిల్లీలోని సాకేత్‌ జే బ్లాక్‌లో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న రోడ్డుపై ఓ యువకుడు కదులుతున్న కారు పైకి ఎక్కి విన్యాసాలు చేస్తూ, ప్రియురాలికి ముద్దు పెడుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ వీడియోలోని కారు యజమానికి జరిమానా విధించినట్లు తెలిపారు. జీవితం చాలా విలువైనదని, ప్రాణాల మీదకు తెచ్చేలా ఇలాంటి విన్యాసాలు చేయొద్దని పౌరులను వారు కోరారు.
short by srikrishna / 12:08 pm on 19 Nov
For the best experience use inshorts app on your smartphone