తన తాత అయిన 101 ఏళ్ల మంగళ్ సైనీ హండాను కలవాలని ఓ మహిళ కువైట్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గతంలో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో పనిచేసిన హండా, ప్రస్తుతం కువైట్‌లో ఉంటున్నారని ఆమె పేర్కొంది. ‘’ఆయనకు మీరంటే ఎంతో అభిమానం. వివరాలను మీ ఆఫీసుకి పంపాను,’’ అని ఎక్స్‌లో తెలిపింది. ప్రధాని మోదీ ఈ పోస్టుకు స్పందిస్తూ, ‘కచ్చితంగా! ఈ రోజు కువైట్‌లో హండాను కలిసేందుకు ఎదురుచూస్తున్నా,’’ అని చెప్పారు.
short by
Sri Krishna /
03:51 pm on
21 Dec