కడప జిల్లా ప్రొద్దుటూరులోని వసంతపేట పురపాలిక ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 10 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడుతుండడంతో పాఠశాల ఉపాధ్యాయులు వారిని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న భోజనం సమయంలో దాదాపు 50 మందికి భోజనం వడ్డించగా.. అందులో పప్పు దుర్వాసన వస్తున్నట్లు విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు.
short by
Devender Dapa /
11:05 pm on
28 Nov