For the best experience use Mini app app on your smartphone
కరీంనగర్ సాయినగర్‌లోని ఓ ఆస్పత్రి వద్ద 6 రోజుల మగశిశువును విక్రయించిన తల్లి, కొనుగోలు చేసిన దంపతులతో పాటు మధ్యవర్తులపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. వారి ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన యువతి ఓ యువకుడి కారణంగా గర్భం దాల్చింది. ఆ తర్వాత అతడు వదిలేసి వెళ్లడంతో మధ్యవర్తుల ద్వారా బిడ్డను రూ.6 లక్షలకు కరీంనగర్‌కు చెందిన దంపతులకు అమ్మేయాలని నిర్ణయించుకుంది. బాలుడిని శిశుగృహానికి తరలించారు.
short by Devender Dapa / 04:03 pm on 22 Nov
For the best experience use inshorts app on your smartphone