కరీంనగర్లోని వావిలాలపల్లిలో ఓ ఇంటి ప్రాంగణంలోకి నక్క దూరడం కలకలం రేపింది. మంగళవారం ఇంట్లోకి నక్క వచ్చిందని ఇంటి యజమాని తెలిపారు. ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చామని, వారు వచ్చేసరికే గేటు నుంచి తప్పించుకుని పారిపోయిందన్నారు. నక్క తోక తొక్కితే అదృష్టంగా భావిస్తారని, అలాంటిది నక్కే తమ ఇంటికి రావడం పట్ల ఆనందంగా ఉందని తెలిపారు. గత నెలలో కరీంనగర్‌లోని సైదాపూర్‌లోని ఓ ఇంటి ఆవరణలోకి ఎలుగుబంటి వచ్చింది.
short by
Devender Dapa /
03:56 pm on
26 Nov