కర్ణాటకలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సహా బెంగళూరు, హుబ్బళ్లి, బెలగావి విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామని ఆదివారం ఉదయం ఈ మెయిల్స్ వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా చర్యలను పటిష్ఠం చేశారు. ప్రయాణికులు, సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
short by
/
12:18 pm on
01 Jul