కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రానికి సమీపంలో ఎర్రవంకలో చిరుత కనిపించింది. విషయం తెలుసుకున్న ప్రజలు పులిని చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత పులి ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా పంపించేశారు. చిరుత అనారోగ్యంగా ఉండటంతో పరుగెత్తలేని పరిస్థితిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పులిని బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
short by
Devender Dapa /
07:28 pm on
15 Jun