గుంటూరు జిల్లా కురగల్లు వద్ద లారీ కింద పడి ఓ బైకర్ మరణించాడు. లారీని ఓవర్ టేక్ చేస్తుండగా అతడు జారి రోడ్డుపై పడిపోగా, ఆయన పై నుంచి అదే లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని ర్యాపిడో రైడర్‌గా పనిచేసే 35 ఏళ్ల యాండ్రూస్‌గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యాండ్రూస్ తమ కళ్లెదుటే చనిపోతున్నా తమకేమీ పట్టనట్లు కొంతమంది స్థానికులు వెళ్లిపోవడం సీసీ కెమెరాల్లో నమోదైంది.
short by
srikrishna /
03:12 pm on
18 Nov