గుండె రక్తనాళాల్లో పూడిక ప్రమాద దశకు చేరుకుంటే అత్యధిక సందర్భాల్లో 4-7 రోజుల ముందు నుంచే శరీరం సంకేతాలనిస్తుందని కార్డియాలజిస్ట్ డా.ప్రమోద్ కుమార్ కుచ్చులకంటి తెలిపారు. చిన్నపాటి పనులకే ఆయాసం, దాంతో పాటు ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం గుండెపోటు అతి ముఖ్యమైన లక్షణమని చెప్పారు. షుగర్‌తో పాటు హైబీపీ ఉన్న వారిలో గుండె రక్తనాళాల జబ్బుల ముప్పు అధికమని 3,070 మందిపై చేసిన అధ్యయనంలో డా.ప్రమోద్ గుర్తించారు.
short by
srikrishna /
09:07 am on
16 Nov