కర్ణాటక నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి ఐరన్ లోడ్‌తో వస్తున్న కంటైనర్ లారీ గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని దారితప్పింది. రాత్రి కావడంతో దారి తెలియక గూగుల్ మ్యాప్స్ చూస్తూ ప్రయాణిస్తున్నానని డ్రైవర్ ఫరూక్ తెలిపాడు. గూగుల్ తప్పుదారి చూపడంతో యాడికి మండలం రామన్న గుడిసెల వద్ద కొండల్లోకి వెళ్లినట్లు అతడు చెప్పాడు. లారీని వెనక్కి తీస్తుండగా లోయలోకి ఒరిగిపోతుండటంతో జేసీబీతో స్థానికులు బయటకు తీశారు.
short by
Bikshapathi Macherla /
10:25 pm on
01 Feb