గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మద్యం మత్తులో ఓ వ్యక్తి నడుపుతున్న కారు వెళ్లి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడానికి ముందు ఆ కారు, డివైడర్‌ను ఢీకొట్టి గాలిలో కొన్ని క్షణాల పాటు ఎగిరి కిందపడ్డట్లు సీసీటీవీ దృశ్యాల్లో ఉంది. కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి ముందు కారు అతివేగంతో ఆటోను ఓవర్ టేక్ చేసింది.
short by
Devender Dapa /
04:42 pm on
03 Dec