గోదావరి నదీపాయల్లో చేపల వేట స్థావరాల కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండలం బలుసుతిప్పలో పడవల పోటీలను స్థానిక మత్స్యకారులు నిర్వహించారు. సుమారు 100 పడవలపై మత్స్యకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వారు.. ఎక్కడైతే ఎక్కువగా చేపలు లభిస్తాయో అక్కడ లంగరు వేసి ఏడాదిపాటు చేపల వేట కొనసాగిస్తారు. ఏటా దీపావళి అనంతరం ఈ పోటీలను నిర్వహిస్తారు.
short by
Devender Dapa /
03:43 pm on
27 Nov