For the best experience use Mini app app on your smartphone
నటుడు బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కలయికలో రూపొందనున్న సినిమా (#NBK111) బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘వీర సింహారెడ్డి’ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. ఈ మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌. బాలకృష్ణ-నయనతార కాంబోలో ఇప్పటికే ‘సింహా’, ‘జైసింహా’, ‘శ్రీరామరాజ్యం’ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు.
short by srikrishna / 01:25 pm on 26 Nov
For the best experience use inshorts app on your smartphone