గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ గుండెను తరలించారు. గుంటూరులోని రమేశ్ ఆసుపత్రిలో చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిన్‌డెడ్ కాగా, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని ఆసుపత్రి యాజమాన్యం మంత్రి నారా లోకేశ్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో ఆయన గుండెను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారని వైద్యులు తెలిపారు.
short by
Devender Dapa /
10:45 pm on
27 Mar