For the best experience use Mini app app on your smartphone
గ్రూప్‌-1 పరీక్షల విషయంలో హైకోర్టు తీర్పు TGPSCకి చెంపపెట్టు అని BRS నేత రాకేశ్‌రెడ్డి అన్నారు. ధర్మానిదే అంతిమ విజయమని స్పష్టమైందన్నారు. “పోరాడిన అభ్యర్థులది విజయం, అండగా నిలిచిన BRSది నైతిక విజయం. పరీక్షల్లో 10మంది అభ్యర్థులు ఎలా పెరిగారు? గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో 21 ఉల్లంఘనలు జరిగాయి,” అని చెప్పారు. కాగా తెలంగాణలో గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని TGPSCని హైకోర్టు ఆదేశించింది.
short by Devender Dapa / 11:49 pm on 18 Apr
For the best experience use inshorts app on your smartphone