గ్రూప్-2 2015 ఎంపిక జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని TSPSC భావిస్తోంది. హైకోర్టు తీర్పును కమిషన్ పరిశీలించింది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి ఫలితాలు వెల్లడించినందున, ఆ అంశాలను పేర్కొంటూ అప్పీలు దాఖలు చేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ఆరేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ తీర్పుపై ఉద్యోగాలు చేస్తున్న వారూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.
short by
Devender Dapa /
10:43 am on
20 Nov