గ్రూప్-2 ప్రధాన పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు శనివారం స్పష్టం చేశారు. రిజర్వేషన్‌లో రోస్టర్ విధానంపై కోర్టులో మార్చి 11న విచారణ ఉన్న దృష్ట్యా అప్పటి వరకు పరీక్ష వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాశామని ఆయన తెలిపారు. మరోవైపు, ఫిబ్రవరి 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఏపీపీఎస్సీ శనివారం తెలిపింది. ఈ క్రమంలో గ్రూప్-2 అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.
short by
Sri Krishna /
06:38 pm on
22 Feb