గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు స్పౌజ్ గ్రౌండ్స్‌పై అంతర్‌జిల్లా బదిలీలకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు బదిలీకి అర్హతలు, మార్గదర్శకాలతో సోమవారం జీవో విడుదల చేసింది. బదిలీ దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలని ఉద్యోగులను కోరింది. నవంబర్ నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తికావాలని, బదిలీల షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని ఈ మేరకు ప్రభుత్వం జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్‌ను కోరింది.
short by
Srinu /
10:40 pm on
17 Nov