తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో 46ను విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు 50%కి మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. వార్డు మెంబర్లకు 2024 కుల సర్వే ఆధారంగా, సర్పంచులకు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించింది. సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లను RDOలు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను MPDOలు ఖరారు చేస్తారు.
short by
Devender Dapa /
02:56 pm on
22 Nov