హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ వద్ద అక్రమ నిర్మాణాలను ‘హైడ్రా’ అధికారులు తొలగించారు. ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఇటీవల హైకోర్టుకు వెళ్లారు. స్పందించిన కోర్టు, వెంటనే ఆక్రమణలను తొలగించాలని ‘హైడ్రా’కు సూచించింది. దీంతో అధికారులు 4 షెడ్లు, నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చేశారు.
short by
Srinu /
03:45 pm on
17 Nov