చైనాలో కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన 11 ఏళ్ల బాలుడి కడుపులో నుంచి వైద్యులు శస్త్రచికిత్స చేసి 100 గ్రాముల బంగారు కడ్డీని బయటకు తీశారు. కడుపులో ఏదో లోహం ఉన్నట్లు ఎక్స్-రేలో కనిపించిందని వైద్యులు తెలిపారు. అయితే శస్త్రచికిత్స చేస్తుండగా కడుపులో బంగారం కనిపించిందని పేర్కొన్నారు. కాగా సదరు బాలుడు ఆడుకుంటున్నప్పుడు బంగారు కడ్డీని మింగాడని, ఆ తర్వాత కడుపు నొప్పి మొదలైందని నివేదికలు తెలిపాయి.
short by
Devender Dapa /
09:06 pm on
19 Apr