కృష్ణా జిల్లా చాట్లవానిపురంలో చేబదులుగా తీసుకున్న రూ.300 కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో సతీశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల ప్రకారం, తన స్నేహితుడైన వెంకటేశ్వరరావుకు సతీశ్ డబ్బులు ఇచ్చాడు. ఈనెల 20న ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి సతీశ్ తలపై వెంకటేశ్వరరావు కర్రతో కొట్టాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు.
short by
Bikshapathi Macherla /
09:20 pm on
26 Dec