తెలంగాణ మానవహక్కుల కమిషన్ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 19 మంది మృతికి కారణమైన బస్సు ప్రమాద ఘటనను సుమోటోగా తీసుకుంది. డిసెంబర్ 15 లోపు నివేదిక సమర్పించాలని రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. జాతీయరహదారుల ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీలను నివేదిక పంపాలని ఆదేశించింది. సోమవారం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
short by
Devender Dapa /
03:55 pm on
04 Nov