అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు ఆశ్రమ బాలికల పాఠశాల-1లో ఆరు, ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అడవిలోకి పారిపోయారు. చదువు రావట్లేదని, అందరిలో వెనకబడ్డామని ఈనెల 6న పాఠశాల నుంచి అడవిలోకి వెళ్లి.. దుంపలు తింటూ, అక్కడి నీరే తాగుతూ గుహలో దాక్కున్నారు. సోమవారం డ్రోన్ల సహాయంతో పోలీసులు గాలింపు చేపట్టి వీరి ఆచూకీ గుర్తించారు. గ్రామస్థుల సహకారంతో ఇద్దరిని పట్టుకుని, తల్లిదండ్రులకు అప్పగించారు.
short by
Devender Dapa /
07:16 pm on
11 Nov