ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు తాను 9 కిలోల బరువు తగ్గానని భారత పేసర్ మహమ్మద్ షమీ వెల్లడించాడు. తాను రోజుకు ఒకపూట మాత్రమే తింటున్నట్లు చెప్పాడు. “2015 నుంచి నేను రోజుకు ఒకపూటే తింటున్నా. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేయను. నేరుగా రాత్రి భోజనం తింటా. ఇది మొదట్లో కష్టంగా అనిపించినా, అలవాటైతే ఈజీ అయిపోతుంది,” అని షమీ వ్యాఖ్యానించాడు. తాను స్వీట్స్ అస్సలు తిననని మహమ్మద్ షమీ తెలిపాడు.
short by
Devender Dapa /
05:37 pm on
22 Feb