ఏపీలో ప్రతీ కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు 2026 జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలన్నారు. కుల ధ్రువీకరణ, పౌష్టికాహారం, స్కాలర్‌షిప్, పెన్షన్లు సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలని చెప్పారు.
short by
srikrishna /
05:20 pm on
24 Nov