జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా 42 ఏళ్ల వల్లాల నవీన్ యాదవ్‌ను ఏఐసీసీ ప్రకటించింది. ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సోషల్ వర్కర్. నవీన్ 2014లో ఎంఐఎం తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసి 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2018లో జూబ్లీహిల్స్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. 2023 నవంబరు 15న రేవంత్‌రెడ్డి సమక్షంలో నవీన్ కాంగ్రెస్‌లో చేరారు.
short by
srikrishna /
08:12 am on
09 Oct