జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు ఈ పోలింగ్ సమయం ముగియగా, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్‌లో ఉన్న ఓటర్లకు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. సాయంత్రం 5.00 గంటల వరకు 47.16 శాతం పోలింగ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది నవంబర్ 14న జరిగే ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది.
short by
Devender Dapa /
07:12 pm on
11 Nov