జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ తెలంగాణ ప్రతినిధి బృందం టోక్యో వాటర్ ఫ్రంట్‌ను సందర్శించింది. కాగా టోక్యో మధ్య నుంచి పారే సుమిదా నది.. రివర్ ఫ్రంట్‌గా అభివృద్ధి చేసిన తర్వాత పర్యాటకులను ఆకర్షిస్తోందని తెలంగాణ CMO తెలిపింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నందున CM, టోక్యో రివర్ ఫ్రంట్‌ను పరిశీలించారని పేర్కొంది.
short by
Devender Dapa /
10:55 pm on
18 Apr