తనను డిప్యూటీ సీఎం చేయాలని జరుగుతున్న చర్చపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘’ప్రస్తుతం నాకు చేతి నిండా పని ఉంది. ప్రధానంగా నాకు అప్పగించిన విద్యా రంగంలో సంస్కరణలు తెచ్చి ఆంధ్రా మోడల్ కేజీ-పీజీ విద్యను అమలు చేయాలని అనుకుంటున్నాను,’’ అని తెలిపారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన లక్ష్యాలను సాధించడమే తన ముందున్న కర్తవ్యమని, అందుకే ఇతర అంశాలపై తాను దృష్టి పెట్టే అవకాశం లేదని ఆయన చెప్పారు.
short by
Sri Krishna /
09:36 am on
22 Jan