For the best experience use Mini app app on your smartphone
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని అంబర్‌నాథ్ ఫ్లైఓవర్‌పై డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఓ కారు అదుపుతప్పి ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ సహా మొత్తం నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. కారు ఢీకొన్న వేగానికి ఓ ద్విచక్రవాహనదారుడు ఫ్లై ఓవర్‌ పైనుంచి అమాంతం ఎగిరి కింద పడిపోయినట్లు వీడియోలో ఉంది. ఈ ప్రమాదం రాత్రి 7.15 గంటల సమయంలో జరిగింది.
short by Devender Dapa / 12:26 pm on 22 Nov
For the best experience use inshorts app on your smartphone