డిస్పోజబుల్ పేపర్ కప్పుల్లో టీ, కాఫీలు తాగడం ప్రమాదకరమని న్యూట్రిషనిస్ట్ ఖుషీ ఛబ్రా తెలిపారు. పేపర్ కప్పుల్లో వాటర్ ప్రూఫ్ లక్షణం కోసం మైక్రో ప్లాస్టిక్ పొరను వాడుతుంటారని ఆమె చెప్పారు. వేడి పదార్థాలను ఆ కప్పులో పోసినప్పుడు ప్లాస్టిక్ పొర కరిగి సూక్ష్మ కణాలు విడుదలవుతాయని, ఇవి రక్తంలోకి ప్రవేశిస్తాయని వివరించారు. ఈ మైక్రోప్లాస్టిక్‌లు జీవక్రియ రుగ్మతకు, హార్మోన్ల అసమతుల్యతకు కారణం కావొచ్చన్నారు.
short by
srikrishna /
11:17 am on
21 Nov