తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు మంగళవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్, కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన గృహ సముదాయం వద్ద బేస్‌మెంట్‌పై నిల్చొని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా అది కుంగింది. శ్రీనివాస్ కింద పడిపోకుండా నేతలు పట్టుకున్నారు.
short by
srikrishna /
01:19 pm on
25 Nov