For the best experience use Mini app app on your smartphone
మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయిన నేపథ్యంలో రద్దీని నియంత్రించడానికి యూపీ సర్కార్‌ 5 ప్రధాన మార్పులు చేసింది. కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్‌ జోన్‌’గా ప్రకటించింది. ఫిబ్రవరి 4 వరకు వీవీఐపీ పాస్‌లు రద్దు చేసింది. అప్పటి వరకు ప్రయాగ్‌రాజ్‌లోకి ఫోర్‌ వీలర్‌ వాహనాలు, పొరుగు జిల్లాల నుంచి వచ్చే వాహనాలు రాకుండా నిషేధం విధించింది. రద్దీని క్రమబద్ధీకరించడానికి వన్-వే మార్గాలను తెచ్చింది.
short by Sri Krishna / 09:49 am on 30 Jan
For the best experience use inshorts app on your smartphone