2024లో జనవరి, సెప్టెంబర్ మధ్య ఉత్తరప్రదేశ్‌కు 47.61 కోట్ల మంది పర్యాటకులు వచ్చారని రాష్ట్ర టూరిజం శాఖ తెలిపింది. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను అయోధ్య అధిగమించి ఎక్కువమంది సందర్శించిన పర్యాటక ప్రదేశంగా నిలిచింది. అయోధ్యకు 13.55 కోట్ల దేశీయ పర్యాటకులు, 3,153 మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. ఆగ్రాకు 12.51 కోట్ల మంది సందర్శకులు వచ్చారు. వీరిలో 11.59 కోట్ల దేశీయ, 9.24 లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులు ఉన్నారు.
short by
Sri Krishna /
09:35 am on
21 Dec