తుర్కియేలోని ఓ ప్రముఖ స్కీ రిసార్ట్‌లోని 12 అంతస్తుల హోటల్‌లో మంగళవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 66 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 51 మంది గాయపడ్డారని ఆ దేశ మంత్రి అలీ తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని, ఆ సమయంలో హోటల్‌లో 234 మంది అతిథులు ఉన్నారని అధికారులు తెలిపారు. భయంతో హోటల్ నుంచి దూకి కొందరు చనిపోయారని చెప్పారు.
short by
Devender Dapa /
10:07 pm on
21 Jan