For the best experience use Mini app app on your smartphone
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో TTD కొనుగోలు విభాగం జనరల్‌ మేనేజర్‌ సుబ్రహ్మణ్యంను సిట్‌ అధికారులు గురువారం అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది. ఈ కేసులో ఇప్పటివరకు నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు, వారికి సహకరించిన వ్యాపారులను మాత్రమే అరెస్టు చేసిన సిట్‌.. తాజాగా సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో CBI నేతృత్వంలోని సిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
short by Devender Dapa / 11:46 pm on 27 Nov
For the best experience use inshorts app on your smartphone